Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

భర్త మర్మాంగాలను కోసేసి... ఏం చేసిందంటే?

ఓ లేడీ కంత్రీ ప్లాన్ వేసింది. మర్మాంగాలను కోసి భర్తను అత్యంత దారుణంగా చంపేసింది. ఏమీ ఎరుగనట్లు డ్రామా మొదలుపెట్టింది. దాన్ని బాగా రక్తి కట్టించింది కూడా. అంత్యక్రియలకు చకాచకా ఏర్పాట్లు చేసింది. భర్త శవాన్ని పూడ్చేస్తే తనకు ఇక నో ప్రాబ్లం అనుకుంది. కా

Advertiesment
wife
, బుధవారం, 25 ఏప్రియల్ 2018 (17:58 IST)
ఓ లేడీ కంత్రీ ప్లాన్ వేసింది. మర్మాంగాలను కోసి భర్తను అత్యంత దారుణంగా చంపేసింది. ఏమీ ఎరుగనట్లు డ్రామా మొదలుపెట్టింది. దాన్ని బాగా రక్తి కట్టించింది కూడా. అంత్యక్రియలకు చకాచకా ఏర్పాట్లు చేసింది. భర్త శవాన్ని పూడ్చేస్తే తనకు ఇక నో ప్రాబ్లం అనుకుంది. కానీ కథ అడ్డం తిరిగింది. కాటికి చేరముందే నిజం బయటపడింది. ఇంతకీ భార్యే భర్తను చంపిన విషయం ఎలా తెలిసింది. 
 
నాగర్ కర్నూలు జిల్లా సిరసవాడకు చెందిన శ్రీనివాసులు, బాలమణికి గత ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కోసం వీరి కుటుంబం హైదారాబాద్‌కు వెళ్ళారు. శ్రీనివాసులు మద్యానికి బానిసగా మారిపోవడం... సంపాదించిన డబ్బంతా తాగుడుకు తగలేయడంతో బాలమణికి భర్తకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో బాలామణి భర్తను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. అర్థరాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన శ్రీనివాసులు మర్మాంగాలను బ్లేడుతో కోసేసింది. దీంతో శ్రీనివాసులు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయాడు. 
 
తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. సొంత గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్ళింది. అంత్యక్రియలు చేయడానికి శ్రీనివాసులు మృతదేహానికి స్నానం చేయిస్తుండగా రక్తం కారింది. దీంతో బంధువులకు అనుమానం వచ్చింది. వెంటనే బంధువులందరూ కలిసి బాలమణిని చావబాది ప్రశ్నిస్తే అసలు విషయాన్ని చెప్పేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్‌లోకి జంప్ అయిన బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి