యాక్.. థూ... ఐస్‌క్రీమ్‌లో ఎలుక.. ఎక్కడ?
వేసవికాలంలో ప్రతి ఒక్కరూ చల్లచల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌లను ఆరగించేందుకు ఇష్టపడుతారు. అయితే, కొన్ని కంపెనీలు ఐస్‌క్రీమ్‌లు తయారు చేసే సమయంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల క్రిమికీటకాలు అందులో వచ్చి చేరుతున్నా
వేసవికాలంలో ప్రతి ఒక్కరూ చల్లచల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌లను ఆరగించేందుకు ఇష్టపడుతారు. అయితే, కొన్ని కంపెనీలు ఐస్‌క్రీమ్‌లు తయారు చేసే సమయంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల క్రిమికీటకాలు అందులో వచ్చి చేరుతున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన వింటే మీరు విస్తుపోవాల్సిందే.
చైనాలోని షాంఘైలో ఓ మహిళ ఎంతో ఇష్టంగా ఐస్‌క్రీం కొనుక్కుని ఆరగించేందుకు యత్నించింది. అయితే, అందులో ఎలుక వచ్చింది. ఆ మహిళ ఐస్‌క్రీంను సగం తిన్నాక దాంట్లో ఎలుక తోక ముందుగా ఆమెకు కనిపించింది. దీంతో మొదట ఆమె ఆ తోకను చూసి గొంగళి పురుగనుకుంది. తర్వాతే అది ఎలుకని తెలిసింది.
ఐస్‌క్రీం గడ్డకట్టుకుపోయినందున అందులో చిక్కుకున్న ఎలుక కూడా అలాగే గడ్డకట్టింది. ఈ క్రమంలో ఆ మహిళ తాను ఐస్‌క్రీం కొనుగోలు చేసిన షాపుకు వెళ్లి తనకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. షాపు అతను తొలుత ఆమెకు 12 ఐస్‌క్రీంలను ఉచితంగా ఇస్తానని చెప్పగా, ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఆ మహిళ డిమాండ్ చేసిన మేరకు నష్టపరిహారం ఇవ్వడంతో ఈ ఘటన సద్దుమణిగిపోయింది.