Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమీర్ ఖాన్ మహాభారతంలో.. ద్రౌపదిగా దీపికా పదుకునే?

ఎన్నిసార్లు చదివినా కొత్త విషయాలను, సరికొత్త సందేశాలను అందించగలిగే సరికొత్త అద్భుత ఇతిహాసం మహాభారతం. అలాంటి మహాభారతంపై దృశ్యరూపకాలు ఎన్నోవచ్చాయి. సీరియల్స్ రూపంలో మహాభారతానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా

Advertiesment
Deepika Padukone
, శనివారం, 28 ఏప్రియల్ 2018 (12:17 IST)
ఎన్నిసార్లు చదివినా కొత్త విషయాలను, సరికొత్త సందేశాలను అందించగలిగే సరికొత్త అద్భుత ఇతిహాసం మహాభారతం. అలాంటి మహాభారతంపై దృశ్యరూపకాలు ఎన్నోవచ్చాయి. సీరియల్స్ రూపంలో మహాభారతానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ అద్భుత మహాభారతాన్ని బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్స్ అమీర్ ఖాన్ సినిమాగా తెరకెక్కించేందుకు సంసిద్ధమయ్యాడు
 
బాహుబలి మేకర్ మహాభారతాన్ని తెరకెక్కించాలనుకున్నా.. ప్రస్తుతానికి ఆ ఐడియాను పక్కనబెట్టి.. ఎన్టీఆర్, చెర్రీతో సినిమా చేసేందుకు సన్నద్ధమయ్యాడు. మరోవైపు మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రగా భీముని కథను తిరిగే స్టోరీతో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ మహాభారతాన్ని సుమారు రూ.1000 కోట్లతో ఈ సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
 
ఈ చిత్రానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ భాషలకు చెందిన అగ్రనటులతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇక మహాభారతంలోని కీలక పాత్ర ద్రౌపది కోసం బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనేను సంప్రదించినట్టు సమాచారం. 
 
వివాదాస్పద చిత్రం పద్మావతిలో తనదైన రీతిలో రాణించిన దీపిక ఈ పాత్రకు సరైనదనే నిర్ణయానికి అమీర్‌ఖాన్ వచ్చినట్టు సమాచారం. ఇప్పటిదాకా అమీర్ ఖాన్ దీపిక కలిసి పనిచేయలేదు. ఒకవేళ మహాభారతం కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తే తప్పకుండా ఆ సినిమాకు క్రేజ్ వస్తుందని సినీ పండితులు చెప్తున్నారు. మరి దీపిక అమీర్ ఖాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సివిల్ సర్వీస్ పరీక్ష -2017.. అగ్రస్థానంలో తెలంగాణ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనుదీప్.. జేడీ కుమారుడు?