బాహుబలి రికార్డును అధిగమించే దిశగా భరత్ అనే నేను... ఎలా?
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకువెళుతోంది మహేష్ బాబు నటించిన భరత్ అనే సినిమా. విడుదలైన నాలుగు రోజుల్లోనే కోట్ల రూపాయలను వసూళ్ళు చేసేసింది. సినిమా యూనిట్ అంచనాలనే సినిమా తారుమారు చేయడమే కాకుండా మహేష్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక రాజకీయ
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకువెళుతోంది మహేష్ బాబు నటించిన భరత్ అనే సినిమా. విడుదలైన నాలుగు రోజుల్లోనే కోట్ల రూపాయలను వసూళ్ళు చేసేసింది. సినిమా యూనిట్ అంచనాలనే సినిమా తారుమారు చేయడమే కాకుండా మహేష్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక రాజకీయ నాయకుడిగా మహేష్ బాబు నటించిన మొదటి సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమాను తిలకించారు.
ప్రేక్షకుల ఊహకు తగ్గట్లు సినిమా కూడా ఉండడంతో చూసిన అభిమానులే మళ్ళీమళ్ళీ సినిమాను చూస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్ల రూపాయల భారీ కలెక్షన్‌ను సాధించినట్లు సినీ యూనిట్ చెబుతోంది. కేరళ, తెలంగాణా రాష్ట్రంలలో సినిమా హౌస్‌ఫుల్‌తో నడుస్తోందంటున్నారు సినీ యూనిట్ సభ్యులు.
గతంలో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డును అధిగమించే దిశగా భరత్ అనే నేను చిత్రం వెళుతోందని తెలుగు సినీపరిశ్రమలోని ప్రముఖులు ఒక అంచనాకు వచ్చారు. సినిమా ఖర్చు పెద్దగా లేకపోయినా ఆదాయం మాత్రం భారీగా వస్తుండడంతో నిర్మాత డి.వి.వి.దానయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.