Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీశ్రీ రవిశంకర్ సహోదరి ఆధ్వర్యంలో అనాయాసంగా ధ్యానం... నేర్చుకోండి...

మే నెల 4 నుండి 6వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా జరిగే సహజసమాధి ధ్యాన శిబిరాల ద్వారా సహజసమాధి ధ్యానాన్ని వేలాదిమంది నేర్చుకొనబోతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ చెల్లెలు, “ఆన్ ది ప్లాటూ ఆఫ్ ది పీక్” పేరుతో అత్యధికంగా అమ్ముడైన గురుద

శ్రీశ్రీ రవిశంకర్ సహోదరి ఆధ్వర్యంలో అనాయాసంగా ధ్యానం... నేర్చుకోండి...
, సోమవారం, 30 ఏప్రియల్ 2018 (12:19 IST)
మే నెల 4 నుండి 6వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా జరిగే సహజసమాధి ధ్యాన శిబిరాల ద్వారా సహజసమాధి ధ్యానాన్ని వేలాదిమంది నేర్చుకొనబోతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ చెల్లెలు, “ఆన్ ది ప్లాటూ ఆఫ్ ది పీక్” పేరుతో అత్యధికంగా అమ్ముడైన గురుదేవుల జీవితచరిత్రను రచించిన శ్రీమతి భానుమతీ నరసింహన్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహిస్తున్నారు.
 
3000కు పైగా అధ్యయనాలలో నిరూపించబడి, ఈనాడు ధ్యానం అనేది అందరికీ తెలిసిన విషయంగా మారింది. ఆలోచనలలో స్పష్టత, శారీరక మానసిక ఆరోగ్యంలో వృద్ధి, మానవ సంబంధాలలో మంచి మార్పులు, మానసిక ప్రశాంతత ధ్యానం వలన కలిగే కొన్ని ఉపయోగాలు మాత్రమే.
 
గత సంవత్సరం జరిగిన ప్రపంచ మానసిక ఆరోగ్య వైద్యుల అంతర్జాతీయ వార్షిక సదస్సులో సహజసమాధి ధ్యానంపై సమర్పించబడిన పరిశోధనాపత్రం అత్యుత్తమ బహుమతిని గెలుచుకుంది. 
 
గుండె, నాడీవ్యవస్థ, కుంగుబాటులపై సహజసమాధి ధ్యానపు ప్రభావాన్ని అందులో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏమాత్రమూ శ్రమ లేకుండా సులభంగా ధ్యానం చేసే విధానం నేర్పబడుతుంది. 14 సంవత్సరాల వయసు పైబడినవారెవరైనా దీనిని నేర్చుకోవచ్చు. ఒక మంత్రాన్ని బోధించటం ద్వారా చంచలంగా ఉన్న మనస్సును ప్రశాంతతవైపు మరలించటం జరుగుతుంది. మనసు ప్రశాంతమైనపుడు ఒత్తిడి మటుమాయమౌతుంది, మనం తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి, జీవితంలో స్పష్టత వస్తుంది.
 
“మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా, మరింత పనిచేసేలా ఉంచగలిగేది ధ్యానం. ఎలాంటి పరిస్థితిలోనైనా మీ చిరునవ్వును కోల్పోకుండా ఉంచేది ధ్యానం.” అంటారు శ్రీమతి భానుమతి. మీ పట్టణంలో ఈ కార్యక్రమం ఈ క్రింద సూచించిన ప్రదేశంలో జరుగుతోంది. మరిన్ని వివరాలకు కింద ఇవ్వబడిన చరవాణి సంఖ్యలను సంప్రదించండి: 9342582375

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు చల్లుతుంటే... టీడీపీ నేతలు గాడిదలు కాస్తున్నారా? ఆర్కే.రోజా ఫైర్