Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రానంటే.. రాను : రజనీకాంత్

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (11:51 IST)
రాజకీయాల్లోకి రానంటేరానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోమారు స్పష్టంచేశారు. కానీ, తాను రాజకీయాల్లోకి రావాలంటూ కొందరు ఆందోళనలు చేస్తున్నారని, అలాంటి సంఘటనలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన చేశారు.
 
'కొంతమంది నా అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం నుంచి తొలగించబడిన స్థానిక నేతలు నేను తిరిగి రాజకీయాల్లోకి రావాలని చెన్నైలో నిరసనలు తెలుపుతూ నా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నా నిర్ణయాన్ని నేను తీసేసుకున్నాను. దాన్ని అందరికీ చెప్పాను. ఇటువంటి నిరసనలకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ ఘటనలు నాకు బాధను కలిగిస్తున్నాయి' అని ఆయన అన్నారు.
 
తాను రాజకీయాల్లోకి రావడం లేదని, పాలిటిక్స్‌లోకి ప్రవేశించకుండానే సేవ చేస్తానని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, గత నెల చివరి వారంలో స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత, పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో తాను ఓ నిర్ణయం తీసేసుకున్నానని ఆయన తెలిపారు. అందరూ దాన్ని గౌరవించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments