తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి అనే బయోపిక్ రానుంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది.
ఈ సినిమా జయలలిత పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాశారు.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఓ వివాదం రాజుకుంది. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె చీర పట్టుకుని లాగడం కూడా ఒకటి. ఆ సన్నివేశంలోనే కంగనా మరి బోల్డ్‌గా నటించందట. అసలుకే ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ చేద్దామా అని కాచుకుని ఉండే.. కంగనాకి ఆ చీర సీన్ తెగ నచ్చేసిందట. అందుకే ఎలాంటి అడ్డుఅదుపు లేకుండా తనకు నచ్చిన హాఫ్ సారీలో ఫుల్ గ్లామర్‌ను గుప్పించిదట.
ఇది తెలిసే తమిళ ప్రేక్షకులు దేవత పాత్రలో దెయ్యం అంటూ కంగనాపై విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే, కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందనేది నిజం, కాబట్టి కంగనా ఏమి చేసినా ప్రత్యేకమే.
ఇక ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా, మరి జయలలితగా ఎలా మెప్పిస్తోందో. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.