Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న ఆరో వందే భారత్ రైలు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (12:58 IST)
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నారు. ఈ రైళ్లకు ఆదరణ కూడా పెరుగుతుంది. దీంతో సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిపోతోంది. పైగా, ఈ రైళ్లు పగటిపూట నడుస్తుండటంతో విశేష ఆదరణ లభిస్తుంది. వందే భారత్ పేరుతో నడుస్తున్న ఈ రైళ్లు ప్రస్తుతం ఐదు రైళ్లు వివిధ రూట్లలో పరుగులు తీస్తున్నాయి. 
 
తాజాగా ఆరో వందే భారత్ రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు నడిచే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటలుగా ఉండేది. 
 
ఇపుడు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే మాత్రం కేవలం ఐదున్నర గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇది బిలాస్‌పూర్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నాగ్‌పూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 7.35 గంటలకు బిలాస్‌పూర్‌కు చేరుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments