ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద నుంచి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కబురు వచ్చింది. ప్రధాని మోడీ తరపున కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోసి... బుధవారం చంద్రబాబుకు ఫోన్ చేశారు.
డిసెంబరు 5వ తేదీన జీ20 భాగస్వామ్య దేశాల సదస్సు భారత్‌లో జరుగనున్న విషయం తెల్సిందే. ఈ సదస్సు గురించి పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ సమావేశంకానున్నారు. ఈ సమావేశం ద్వారా అన్ని పార్టీల సూచనలు, అభిప్రాయాలను ప్రధాని మోడీ స్వీకరించనున్నారు.
డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ఢిల్లీలో జరుగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీ తరపున కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు 5వ తేదీ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.