Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

parliament
, మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:25 IST)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా మంగళవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో సభ సజావుగా సాగడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలుపై చర్చించనున్నారు. 
 
కాగా, పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమై 29వ తేదీతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సారథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ దఫా సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 
 
మరోవైపు, ఈ శీతాకాల సమావేశంలో మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్‌సభ, రాజ్యసభకు చెందిన వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. ఈ భేటీలో ప్రధాని మోడీ సైతం పాల్గొననున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు సలహా బాగుంది.. విజన్ సిద్ధం చేయండి : ప్రధాని మోడీ