Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌కు డిసెంబర్‌ 6న తిరిగివస్తోన్న ల్యాండ్‌మార్క్‌ ఎక్స్‌సీడ్‌ కాన్ఫరెన్స్‌

image
, సోమవారం, 5 డిశెంబరు 2022 (22:50 IST)
చిన్నారులలో సమస్యా పూరణ నైపుణ్యం మెరుగుపరచడంతో పాటుగా క్రిటికల్‌ థింకింగ్‌ను సైతం మెరుగుపరుస్తున్న సింగపూర్‌ కేంద్రంగా కలిగిన వైవిధ్యమైన విద్యాకార్యక్రమం ఎక్స్‌సీడ్‌, కొవిడ్‌ అనంతర కాలంలో హైదరాబాద్‌కు తిరిగి వస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉండే ఈ కార్యక్రమం ఆంధ్ర, తెలంగాణా విద్యా రంగాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తూ డిసెంబర్‌ 6వ తేదీన నగరంలోని పార్క్‌ హోటల్‌లో ఓ సదస్సు నిర్వహించనుంది.
 
ఈ ఎక్స్‌సీడ్‌ సదస్సులో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌, స్కూల్‌ యజమానులు, తల్లిదండ్రులు పాల్గొననున్నారు. ఇప్పటికే 300కు పైగా పాఠశాలలు ఈ సదస్సులో పాల్గొనడానికి నమోదు చేసుకున్నాయి. ‘‘కొవిడ్‌ అనంతరం దక్షిణ భారతదేశంలో తాము నిర్వహించాలనుకున్న ఐదు సదస్సులలో హైదరాబాద్‌ సదస్సు మొదటిది. ఈ నగరం మాకు అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఓ దశాబ్దం క్రితం ఇక్కడే మేము కార్యకలాపాలు ప్రారంభించాము. ఈ నగరం ఎప్పుడూ కూడా నూతన పద్ధతులు, ఉపకరణాలు, సాంకేతికతలను  స్వీకరించడానికి ముందుంటుంది. నగరంలో పలు పాఠశాలలు ఎక్స్‌సీడ్‌ ప్రోగ్రామ్‌ అమలు చేస్తున్నాయి.  అవన్నీ కూడా ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నాయి’’ అని  ఎక్స్‌సీడ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండర్‌ మరియు  హార్వార్డ్‌ అలుమ్ని అశీష్‌ రాజ్‌పాల్‌  అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘ఈ సదస్సును జాతీయ విద్యా విధానాన్ని ఉత్తమంగా ఎలా అమలు చేయాలనే దానిపై దృష్టి సారిస్తూనే పిల్లలను భవిష్యత్‌కు సిద్ధం చేస్తూ క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యాలనూ మెరుగుపరిచేలా నిర్వహించబోతున్నాము’’ అని ఆయన జోడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్‌లో మళ్లీ అధికారం కమలనాథులదే..