ఉడిపి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ దంపతుల మృత్యువాత

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (12:16 IST)
కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు మృత్యువాతపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో జిల్లాలోని ఉరవకొండ, చిన్న ముుష్టూరుకు చెందిన దంపతులు, వారి కుమార్తె చనిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
చిన్న ముష్టూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరాములు అనే వ్యక్తి కుమారుడు శ్రీకాంత్ (41), కోడలు ప్రతీక్ష (35)లు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి గమ్య (4) అనే కుమార్తె, దైవిక (2) అనే కుమారుడు ఉన్నాడు. 
 
కుమారుడిని అనంతపురంలో ఉంటున్న అమ్మమ్మ వద్ద విదిలిపెట్టిన దంపతులు.. శుక్రవారం రాత్రి కుమార్తెతో కలిసి బెగుళూరుకు కారులో బయలుదేరి, మధ్యలో ధర్మస్థలం మంజునాథ స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ శనివారం స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని కారులోనే శృంగేరికి బయలుదేరారు. 
 
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఉడిపి జదిల్లా కార్కల ఠాణా పరిధిలో ఓ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, ప్రతీక్షతో పాటు వారి కుమార్తె గమ్య కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ తల్లిదండ్రులు, అత్తమామలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments