Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింట్లో విషాదం.. కాసేపట్లో ముహూర్తం.. అంతలోనే వధువు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (11:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేటలోని ఓ పెళ్లింట విషాదం నెలకొంది. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
నవీపేటకు చెందిన ర్యాగల రవళి (26)కు నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో మూహూర్తం. 
 
ఇంతలో పెళ్లి కుమార్తె తమ ఇంట్లోని స్టోర్ రూమ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. యువతి ఉరికంబానికి వేలాడుతుండటాన్ని గమనించిన తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాబోయే పెళ్లి కుమారుడు శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో తమ కుమార్తెకు ఫోన్ చేశాడని, అతడు పెట్టిన మానసికక్షోభతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని యువతి తండ్రి ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెళ్లి కుమారుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. 
 
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, ఈ ఘటనతో బంధువులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇటీవల జరిగే మెహందీ ఫంక్షన్‌లో ఎంతో ఉత్సాహంగా గడిపిన రవళి.. ఇంతలోనే శవమై కనిపించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments