Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమ్మాటికీ పీఓకే పాకిస్థాన్‌దే : ఫరూక్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ పాకిస్థాన్‌కు చెందిన భూభాగమన్నారు. ప్రస్తుతం ఈయన చ

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (14:02 IST)
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ పాకిస్థాన్‌కు చెందిన భూభాగమన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం పాకిస్థాన్‌ది. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. ఇంకా ఎన్ని సార్లు భారత్, పాకిస్థాన్ యుద్ధాలకు దిగుతాయి అని ప్రశ్నించారు. వేర్పాటువాదులు తరుచుగా కాశ్మీర్‌కు స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నారని, కాశ్మీర్ చుట్టూ ఉన్న భారత్, పాకిస్థాన్, చైనా మూడు అణ్వాయుధ దేశాలేనని అలాంటప్పుడు స్వాతంత్య్రం ఎందుకని ప్రశ్నించారు. 
 
కాశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలంటూ పోరాడటం వృథా అని, స్వాతంత్య్రంతో ఒరిగేదేమీ ఉండదన్నారు. కాశ్మీర్ చుట్టూ మూడు అణ్వాయుధ దేశాలున్నాయని (భారత్, పాకిస్థాన్, చైనా) అలాంటప్పుడు స్వాతంత్య్రం వచ్చినా ఒక్కటే, రాకున్నా ఒక్కటే అని అభిప్రాయడ్డారు. 
 
భారత్‌లో కాశ్మీర్ విలీనం గురించి ఎప్పుడో నిర్ణయం జరిగింది. కానీ కాశ్మీరీయుల ప్రేమను మాత్రం భారత్ గుర్తించలేదు. కాశ్మీర్‌లో ప్రస్తుత అనిశ్చితికి ఇదే కారణమన్నారు. కాశ్మీర్ సమస్య భారత్, పాకిస్థాన్‌తో ముడిపడి ఉన్న నేపథ్యంలో భారత్ పొరుగుదేశమైన పాక్‌తో చర్చలు జరుపాలని కోరారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments