Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోదరుడి అక్రమ సంబంధం: చెల్లెల్ని నగ్నంగా గంట పాటు ఊరేగించారు

పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఈ పంచాయతి వ్యవస్థే కొనసాగుతోంది. ఏది కూడా పోలీస్ స్టే

Advertiesment
సోదరుడి అక్రమ సంబంధం: చెల్లెల్ని నగ్నంగా గంట పాటు ఊరేగించారు
, బుధవారం, 8 నవంబరు 2017 (11:14 IST)
పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.  కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఈ పంచాయతి వ్యవస్థే కొనసాగుతోంది. ఏది కూడా పోలీస్ స్టేషన్ దాకా రాకుండా పంచాయతీలోనే తీర్మానం చేస్తుంటారు. అలాంటి తీర్మానమే ఇది. గ్రామ పంచాయతీలు చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయని ఎన్జీవోలు ఫైర్ అవుతున్నారు. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే..? సోదరుడు చేసిన తప్పుకు అతడి సోదరిని నగ్నంగా ఊరేగించారు. సోదరుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. అతడి చెల్లెల్ని నగ్నంగా ఊరేగించారు. ఈ మూర్ఖపు తీర్పుతో ఆ యువతి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
బాధిత బాలిక సోదరుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన మహిళ బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. యువకుడి 14 ఏళ్ల సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించాలని పంచాయతిలో శిక్ష విధించారు. బాలికకు స్నానం చేయించిన గ్రామస్తులు ఆమె దుస్తులను బలవంతంగా విప్పించి గంటపాటు ఊరంతా ఊరేగించారు. ఈ దుర్ఘటన అక్టోబరు 27న జరిగినా లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేటర్‌లో టాయి‌లెట్‌కెళ్లిన మహిళ.. చేయిపట్టిన లాగిన కార్మికుడు...