Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిసెంబర్ 31 నాటికి భారీ భూకంపం: 120-180కి.మీ వేగంతో గాలులు, భారీ వర్షాలు..

డిసెంబర్ 31నాటికి హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం ఏర్పడే అవకాశం ఉందని భారతీయ జ్యోతిష్యుడు చెప్పిన జోస్యంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. భూకంపం కారణంగా సునామీలాంటివి సంభవిస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుం

డిసెంబర్ 31 నాటికి భారీ భూకంపం: 120-180కి.మీ వేగంతో గాలులు, భారీ వర్షాలు..
, సోమవారం, 6 నవంబరు 2017 (13:26 IST)
డిసెంబర్ 31నాటికి హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం ఏర్పడే అవకాశం ఉందని భారతీయ జ్యోతిష్యుడు చెప్పిన జోస్యంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది.

భూకంపం కారణంగా సునామీలాంటివి సంభవిస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుందని.. దీంతో ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ పీఎంవో ఆధ్వర్యంలోన ఎర్రా సునామీ, భూకంపాలను తట్టుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు పాకిస్థాన్ పీఎంవో ఎర్రాకు ఆదేశిస్తూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇంతకీ భారతీయ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే?
కేరళకు చెందిన బాబూ కాలాయిల్ అనే జ్యోతిష్యుడు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీనాటికల్లా హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం ఏర్పడుతుందని హెచ్చరిస్తూ.. సెప్టెంబర్ 20వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ భూకంపం ధాటికి భారత్, పాకిస్థాన్, చైనా సహా మొత్తం 11 దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ భూకంపం ప్రభావంతో ఆసియా దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. భారత్, చైనా, జపాన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, గల్ఫ్ దేశాల్లో 120-180 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. భారీ వర్షాలు కురుస్తాయని కాలాయిల్ హెచ్చరించారు. 
 
కానీ మనదేశ పీఎంవో దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా.. పాకిస్థాన్ మాత్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ వార్త సోషల్ మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్‌లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు చర్చ మొదలెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొడగొట్టి చెప్పండి... అన్న వస్తున్నాడని : ఆర్కే.రోజా పిలుపు