Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీవ్రవాదుల చేతికి ఎం4 కార్బైన్ ఎలా వచ్చింది.. పాకిస్థాన్‌ను ప్రశ్నించిన ఇండియన్ ఆర్మీ

పాకిస్థాన్‌పై భారత ఆర్మీ నిప్పులు చెరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని భారత ఆర్మీ పాకిస్థాన్ ఆర్మీపై ఎన్నోసార్లు ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా కాశ్మీర్‌లో తీవ్రవాదులకు పాకి

Advertiesment
US
, బుధవారం, 8 నవంబరు 2017 (10:04 IST)
పాకిస్థాన్‌పై భారత ఆర్మీ నిప్పులు చెరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని భారత ఆర్మీ పాకిస్థాన్ ఆర్మీపై ఎన్నోసార్లు ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా కాశ్మీర్‌లో తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీకి లింకుందనేందుకు బలమైన సాక్ష్యాన్ని బయటపెట్టింది. పుల్వామా జిల్లా అగ్లర్‌ ప్రాంతం కందీ బెల్ట్‌‌లో  ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. 
 
అనంతరం ఆ ప్రదేశంలో జరిపిన తనిఖీల్లో ఓ ఉగ్రవాది వద్ద ఎం4 కార్బైన్ ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇది అమెరికాలో తయారైన ఆయుధమన్నారు. దీనిని నాటో దళాలు వినియోగిస్తాయని.. అలాంటి ఆయుధం తీవ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ఆర్మీ అధికారులు పాకిస్థాన్‌ను ప్రశ్నించారు. 
 
పాక్ సైన్యానికి చెందిన ప్రత్యేక దళం ఈ ఆయుధాన్ని వినియోగిస్తోందని.. ఈ ఆయుధం పాక్ సైన్యం వద్ద ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఫోటోలు హల్ చల్ చేశాయనే విషయాన్ని ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు గుర్తు చేశారు.
 
ఈ ఆయుధాన్ని పాకిస్థాన్ సైన్యమే ఉగ్రవాది చేతికి అందించిందని వారు ఆరోపించారు. కాగా  జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ మేనల్లుడితో పాటు ముగ్గురు ఉగ్రవాదులు.. జమ్మూలోని పుల్వామా జిల్లా ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిమాచల్‌ప్రదేశ్ బ్యాలెట్ సమరం : పోలింగ్‌కు సర్వం సిద్ధం