Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థిని సన్మానించిన గ్రామస్థులు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (09:04 IST)
హర్యానా రాష్ట్రంలో తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థిని స్థానికులు ఘనంగా సన్మానించారు. రూ.12 లక్షల నగదుతో పాటు ఓ స్విఫ్ట్ డిజైర్ కారును సైతం బహుకరించారు. అదేవిధంగా మరో గ్రామంలో గెలిచిన అభ్యర్థిని కూడా గ్రామస్థులు అదిరిపోయే విధంగా సన్మానించారు. 
 
హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్‌లోని నథోడి అనే గ్రామానికి తాజాగ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 4416 ఓట్లకుగాను, వీటిలో సుందర్ అనే అభ్యర్థికి 2200 ఓట్లు, నరేందర్ అనే అభ్యర్థికి 2201 ఓట్లు వచ్చాయి. దీంతో సుందర్ ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలయ్యాడు. 
 
అయితే, ఓడిపోయిన అభ్యర్థికి గ్రామస్థులంతా కలిసి అదిరిపోయేలా సన్మానించారు. సుందర్‌కు రూ.11,11,000 నగదుతో పాటు ఓ స్విఫ్ట్ డిజైర్ కారును బహుకరిచారు. అలాగే, మరో పక్క గ్రామంలో గెలిచిన అభ్యర్థిని కూడా రూ.11,500 నోట్ల గజమాలతో ఘనంగా సత్కరించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments