బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై దాడి - వీడియో వైరల్

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:33 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఓ అకతాయి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ దాడి కూడా ఆయన స్వగ్రామంలోనే జరగడం కలకలం రేపింది. దీంతో భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి దాడి చేసిన యువకుడుని అదుపులోకి తీసుకున్నారు. 
 
ముఖ్యమంత్రి హోదాలో ఆదివారం నితీశ్ కుమార్ తన స్వగ్రామమైన భకిత్యాపూర్‌కు వెళ్లారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని స్థానిక ఆస్పత్రిలో ప్రతిష్టించారు. ఈ విగ్రహావిష్కరణకు సీఎం నితీశ్ వచ్చారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన నివాళులు అర్పిస్తుండగా, ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని వేదికపైకి ఎక్కి ముఖ్యమంత్రిపై దాడి చేశారు. 
 
ఈ ఘటనతో భద్రతా సిబ్బందితో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది ముందుకొచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ యువకుడు మతిస్థిమితం లేనివాడిగా గుర్తించారు. అయితే, ఎంతో భద్రత ఉండే సీఎంపై ఈ తరహా దాడి జరగడం కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments