ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిన సినిమా `ది కశ్మీర్ ఫైల్స్`. ఈ సినిమా గురించి దేశంలో రకరకాలు మాధ్యమాలలో ప్రచారం జరిగింది. ఈ సినిమా ధాటికి రాధేశ్యామ్ కూడా ఢమాల్ అయిపోయింది. అయితే కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రకాష్‌రాజ్ కూడా తన సోషల్ మీడియాలో, మానిపోయిన గాయం మరింత పెంచడానికా? పోరాడమనా? ఎందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. తాజాగా హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలువురు మేథావులు ఈ సినిమాపై చర్చాగోష్టి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరసైనికులకంటే ఎక్కువగా పండిట్‌లకు సానుభూతి వచ్చింది. 1990లో ఇంత ఘోరాలు జరుగుతుంటే అప్పట్లో బిజెపి ప్రభుత్వం కూడా వుంది. అటల్‌జీ ఆ తర్వత పాలన సాగించారు. కానీ వారికి ఆయన ఏంచేశాడు? అంటూ ప్రశ్నించారు. పలువురు సామాజిక వేత్తలు, మేథావులు ఈ విధంగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
- 2014 నుండి బీజేపీ పాలనలో ఉంది. నేటికీ 8 ఏళ్ళు. కశ్మీర్ పండితులను ఎందుకు న్యాయం చేయలేకపోతుంది.
- - ఆర్టికల్ 370 రద్దు నాలుగేళ్లు అయిపోతుంది. కశ్మీరీ పండిట్ల జీవితాలలో ఎందుకు మార్పురాలేదు.
- కశ్మీర్ పండితులను తిరిగి కాశ్మీర్ లోయకు బీజేపీ ఎందుకు తీసుకెళ్లలేకపోయింది.
- కశ్మీర్ పండితులను అన్యాయం చేసిన దుర్మార్గులను ఎందుకు శిక్షించలేకపోయింది.
- కశ్మీర్ పండితులు పూర్తి ఆత్మభిమానం, ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితి బీజేపీ ఎందుకు తీసుకోలేకపోయింది.
- అప్పట్లో అటల్ బిహారి ప్రభుత్వం ఆరేళ్ళు పాలించింది.
- తీవ్రవాదుల దాడుల తర్వాత పండితులకు రక్షణ కల్పించడానికి బదులు బీజేపీకి చెందిన గవర్నర్ జగ్‌మోహన్.. వీరందరికీ జమ్మూలో పునరావాసం కల్పించలేకపోయారు. దానికి కారణం ఏమిటి?
- "కశ్మీరీ హిందూ కుటుంబాలను పునరావాసం కల్పించడానికి, వారి సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.
- లోయ నుంచి నిర్వాసితులై కశ్మీరీ పండితులను ప్రస్తుతం నివాస ధ్రువీకరణ పత్రం కూడా బీజేపీ ఎందుకు ఇవ్వలేకపొతున్నది.
- కాశ్మీర్ ఫైల్స్ సినిమాకి టాక్స్ మినహాయిస్తే కశ్మీరీ పండితుల సమస్య తీరుతుందా.
- హిందువుల కోసం బీజేపీ పని చేస్తుందంటూ వారి సమస్యలు పరిష్కరించకుండా కాశ్మీర్ ఓట్ల కోసం కేవలం ఓట్ల రాజకీయం చేయడం దుర్మార్గం కాదా? మోసం చేయడం కాదా?
- బీజేపీ దేశంలో హిందూ, ముస్లింల మధ్య విభజనను సృష్టించి కశ్మీరీ పండిట్ల సమస్యపై ఎన్నికల్లో లబ్ధి పొందాలని నకిలీ ఆగ్రహావేశాలను పెంచడానికే కశ్మీ ర్ ఫైల్స్ ను రాజకీయంగా వాడుకుంటోందని వారు ధ్వజమెత్తారు.
- సినిమా అన్ని నిజాలే చూపిస్తే, అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పటికీ వున్నారు వారిని ఎందుకు శిక్షించలేకపోయిందని ఇప్పటి ప్రభుత్వాన్ని సూటింగా ప్రశ్నించారు.