Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు పొంచివున్న యుద్ధ ముప్పు - ఆ రెండు దేశాల కుట్ర : ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (11:08 IST)
భారత్‌కు యుద్ధ ముప్పు పొంచివుందని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ దేశాలతో ఈ యుద్ధ ముప్పు పొంచివుందని ఆయన హెచ్చరించారు. పాక్ పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపడం మనకు ఆందోళనకరమేనని వ్యాఖ్యానించారు. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తుందని వెల్లడించారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సైనిక సన్నద్ధత, సరిహద్దుల పరిస్థితులు, బంగ్లాదేశ్ అంశం తదితర అంశాలపై అడిగి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 
 
భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్‌లు కుమ్మక్కువుతున్నాయని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అయిన పాకిస్థాన్ మన పొరుగున ఉన్న ఏ దేశంతోనైనా సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఆందోళనకరమని అన్నారు. ఎందుకంటే ఆ దేశాన్ని కూడా పాక్ ఉగ్రవాద చర్యలకు ఉపయోగించుుకనే అవకాశం ఉండటమేనని పేర్కొన్నారు. 
 
చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తోందని, కుమ్మక్కును సంబంధించి నేడున్న పరిస్థితి ఇది ఆయన అన్నారు. ఆ రెండు దేశాల మధ్య కుట్రపూరిత సంబంధాలు ఉన్నాయన్న వాస్తవాన్ని భారత్ అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌కు సంబంధించి ఇపుడే ఒక నిర్ణయానికి తొందరపాటు అవుతుందని అన్నారు. అయితే, భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments