Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి - శ్రీకాకుళంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు!

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (09:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమరావతిలో విమానాశ్రయంలో ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ప్రపంచ స్థాయి సంస్థలు నేరుగా ఇక్కడకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో మరొక విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించారు. 
 
ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ సాంకేతిక, ఆర్థిక అంశాలపై నివేదిక కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ విమానాశ్రయాల నిర్మాణం కోసం బిడ్లను ఆహ్వానించి, బిడ్లు దాఖలు చేయడానికి 32 వారాల గడువు ఇచ్చింది. విమానాశ్రయాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాణిజ్య అభివృద్ధి అవకాసాలను అంచనా వేయాలని కోరింది. హైదరాబాద్ విమానాశ్రయం అభివృద్ధి చెందిన తర్వాత పెట్టుబడులు పెరిగాయని ప్రభుత్వం గుర్తు చేసింది. అమరావతిలో విమానాశ్రయం లేకపోవడంతో వల్ల అంతర్జాతీయ గుర్తింపు లేదని భావిస్తున్నారు. 
 
ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుంది : బోరుగడ్డ అనిల్ 
 
తనకు ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుందని తనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని వైకాపా నేత, ప్రముఖ రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆరోపిస్తూ ఓ సెల్పీ వీడియోను విడుదల చేశారు. గత నాలుగు నెలలుగా టీడీపీ కూటమి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంటూ కంటతడి పెట్టుకుంటూ ఈ వీడియోను విడుదల చేశారు. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల వల్ల తనకు ప్రాణహాని ఉంది, వాళ్ల నుంచి తనను కాపాడాలని ఆయన వేడుకున్నారు. తనకు ఏమైనా జరిగితే అందుకు లోకేశ్, పవన్ కళ్యాణ్‌లదే బాధ్యత అని అన్నారు. తనకు దేవుడు, జగన్,, వైకాపానే దిక్కు అని పేర్కొన్నారు. 
 
అనంతపురంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర చేశారని ఆరోపించారు. కర్నూలులో పోలీసులు తను చిత్రహింససలు పెట్టారని వాపోయారు. తన తల్లికి అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిందని, ఆమెను చూసుకోవాల్సింది తానేనని చెప్పారు. 
 
తన తల్లి ఆరోగ్యం విషయంలో కోర్టు తప్పుడు ధృవపత్రాలు సమర్పించానని పోలీసులు చెబుతున్నారని, ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానని, అలాంటి సమయంలో నకిలీ ధృవపత్రాలు ఎలా సృష్టిస్తానని బోరుగడ్డ ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు  చేయలేదని, న్యాయస్థానాలంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం చెన్నైలో ఉండి తన తల్లిని చూసుకుంటున్నాని, తనకు జగన్, వైకాపా తప్ప ఎవరూ లేరని వాపోయారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదని వీడియోలో ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments