Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాంపియన్స్ ట్రోఫీ : రసవత్తర పోటీకి వేళైంది... భారత్ వర్సెస్ కివీస్

Advertiesment
kohli - rohit - gambhir

ఠాగూర్

, ఆదివారం, 9 మార్చి 2025 (09:55 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రసవత్తర పోటీకి సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఈ పోటీలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. 12 యేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకునేందుకు భారత్ ఒక్క అడుగు దూరంలో ఉంది. అయితే, న్యూజిలాండ్ కూడా అంతే బలంగా ఉంది. దీంతో ఈ అంతిమ పోరు రెండు సమ ఉజ్జీలైన జట్ల మధ్య అమితాసక్తికరంగా సాగనుంది. 
 
అయితే, ప్రత్యర్థి జట్టును ఓడించాలంటే భారత కుర్రోళ్లు మరింతగా శ్రమించాల్సివుంది. ఐసీసీ ట్రోఫీలలో భారత్‌పై కివీస్‌కు 10-6 ఆధిక్యం ఉండటం గమనార్హం. ఇదే నాకౌట్ మ్యాచ్‌లలో ఆ జట్టు లక్ష్యం 3-1గా ఉంది. మరోవైపు అన్ని మ్యాచ్‌లలోనూ దుబాయ్‌లో ఆడటం వల్ల అదనపు ప్రయోజనం పొందుతోందంటూ క్రికెట్ ప్రపంచంలో ఓ వర్గం కోడై కూస్తోంది. 
 
ఈ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఉపయోగిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూపు దశ మ్యాచ్ జరిగిన పిచ్‌పైనే ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. పిచ్ మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. 270-280 పరుగులు చేసినా మంచి స్కోరే అవుతుంది. ఈ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌లోల సగటు స్కోరు 246గా ఉంది. 
 
తుది జట్ల మంచనా... 
భారత్ : రోహిత్ శర్మ, గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, షమి, వరుణ్ చక్రవర్తి.
 
న్యూజిలాండ్ : విల్ యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్, జేమీసన్, హెన్రీ లేదా డఫి, ఒరూర్క్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ : ఆల్‌రౌండర్లదే కీలక.. రవిశాస్త్రి