Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాంపియన్స్ ఫైనల్ పోరులో భారత్ టాస్ గెలవకూడదు : అశ్విన్

Advertiesment
aswin

ఠాగూర్

, ఆదివారం, 9 మార్చి 2025 (10:23 IST)
దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ చాంపియన్స్ ఫైనల్ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలవకూడదని భారత లెగ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. భారత్ ఇప్పటివరకు వరుసగా 14 సార్లు టాస్ ఓడిపోయింది. ఈ సారైనా టాస్ గెలుస్తుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 11 సార్లు టాస్‌ను కోల్పోయాడు. అయితే, భారత్ మాత్రం పైనల్‌లో టాస్ గెలవాల్సిన అవసరం లేదని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. తుది పోరులో మాత్రం టీమిండియానే ఫేవరేట్ అని పేర్కొన్నారు. 
 
"నా అభిప్రాయం ప్రకారం భారత్ ఈసారి కప్ గెలవకుండా ఉంటేనే బాగుంటుంది. కివీస్‌కే ఏది ఎంచుకోవాలో వదిలివేయాలి. అపుడు భారత్‌ను క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసే అవకాశం లేకపోలేదు. కానీ, భారత్ ఇప్పటివరకు ఈ ట్రోఫీలో టాస్ ఓడినపుడు లక్ష్య ఛేదనకు దిగినా, తొలుత బ్యాటింగ్ చేసినా విజయం సాధించింది. ఈసారి కూడా భారత్ విజయం సాధిస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. న్యూజిలాండ్ బౌలర్లు గతంలో భారత్‌ను ఇబ్బందిపెట్టారు. ఇపుడూ వారు కాస్త బలంగానే ఉన్నారు" అని అశ్విన్ తెలిపారు. 
 
"మీరు క్రికెట్‌లో అనుభవజ్ఞులైతే మాత్రం ఫైనల్ ఎవరి మధ్య పోటీ బాగుంటుందనేది అంచనా వేయగలరు. నేనైతే కేన్ విలియమ్సన్, రవీంద్ర జడేజా మధ్య పోటీ ఆసక్తికరంగా సాగుతుందని భావిస్తున్నాను. విలియమ్సన్ లెగ్ స్టంప్‌ ఆవలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు బౌలర్ నెత్తిమీదుగా షాట్లు ఆడుతాడు. బ్యాక్‌ఫుట్ మీద కట్‌షాట్లను ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే జడ్డూ - కేన్ మధ్య పోరు పిల్లి ఎలుక పోరాటం మాదిరిగా ఉంటుందని భావిస్తున్నాను" అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ : రసవత్తర పోటీకి వేళైంది... భారత్ వర్సెస్ కివీస్