Instagramలో కొత్త అప్‌డేట్.. ఫేక్ అని తెలిస్తే రిపోర్ట్ చేయొచ్చట..

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (19:39 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసే అంశాలు ఫేక్ అయితే ధారాళంగా రిపోర్ట్ చేసే ఆప్షన్ ఇన్‌స్టాగ్రామ్‌లో జతచేయడం జరిగింది.


సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌ను భారీ స్థాయిలో ఉపయోగిస్తున్నారు. 
 
ఇందులో తమ ఫోటోలను పోస్టు చేస్తున్నారు. అందాలను ఆరబోసే హీరోయిన్లకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలెబ్రిటీలకు ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత కొత్త అప్‌డేట్స్‌ను, ఫీచర్స్‌ను జతచేస్తోంది. 
 
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ హల్ చల్ చేస్తున్నాయని ఆరోపణలను అరికట్టే దిశగా ఇన్‌స్టాగ్రామ్‌లో రిపోర్ట్ అనే ఫీచర్‌ను అమలులోకి తెచ్చింది. ఇన్‌స్టాలో ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయితే ఇకపై ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేయవచ్చు.

54 ఫాక్ట్ చెకింగ్ పార్ట్‌నర్లతో కలిసి 42 భాషల్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. తొలి విడతగా అమెరికాలోని ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఈ ఆప్షన్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments