మొన్నటి వరకు ఆమె పేరు విశాల్ గర్ల్ ఫ్రెండ్‌గా హల్చల్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె తనకంటూ ఒక నేమ్.. ఇమేజ్ సంపాదించుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా చేసిన స్టేట్మెంట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విశాల్ మీద కోపంతో అలా మాట్లాడిందా అన్న ప్రచారం జరుగుతోంది.
వరలక్ష్మి. తమిళంలో సినీ హీరో శరత్ కుమార్ కుమార్తె. చేసింది కొన్ని సినిమాలు. కానీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నలుగుతూనే ఉంటుంది. ఎఫైర్లు అవి, ఇవి అంటూ తమిళనాడులో ఆమెపై పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతోంది. ఇప్పుడు వరలక్ష్మి పెళ్ళిపైనే చర్చ బాగానే జరుగుతోంది.
విశాల్‌ను ఆమె పెళ్ళి చేసుకుంటుందని చర్చ జరిగింది. అయితే ఇద్దరి మధ్యా ప్రేమ చెడిపోవడంతో చివరకు ఆమె పెళ్ళి అంటేనే అసహ్యించుకుంటోందట. పెళ్ళి అంటేనే తనకు మంట అని.. దయచేసి ఆ మాట తన వద్ద మాట్లాడవద్దని కోరుతోందట వరలక్ష్మి. పెళ్ళి గురించి ఈమె వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవచ్చు గానీ, పెళ్లి గురించి ఆమె మాట్లాడిన మాటలే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. పెళ్ళి చేసుకొని ఏమి చేయాలి. అదంటే నాకు ఇష్టం ఉండదని అడిగిన వారి ముఖం మీద చెప్పేస్తోందట వరలక్ష్మి.