Webdunia - Bharat's app for daily news and videos

Install App

సతీమణి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ భావోద్వేగానికి లోనైన మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి(Video)

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (18:41 IST)
స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడి సమాజం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు కొందరు మహానీయులు.. కాని నేటి సమాజంలో దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. వీటిలో మార్పు రావాలని ఆశిస్తున్నాం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి చేపట్టిన ఓ కార్యక్రమం అక్కడి వారి హృదయాలను కదిలించింది. 
 
తన అర్థాంగి పల్లె ఉమ ఇటీవల అనారోగ్యంతో కన్ను మూశారు. ఎన్నికల ముందు ఆమె మరణం ఆయన్ను బాగా కుంగదీసింది. ఆయన వేసిన ప్రతి అడుగులో ఆమె సహకారాన్ని పల్లె రఘునాథరెడ్డి మరవలేకపోయారు. అందుకే ఆమె నిత్యం తన ముందే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఏకంగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 
 
రుద్రంపేటలోనే ఆయనకు సంబంధించి పివికెకె కళాశాలలో ఆమె విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఆయన నివాసం కూడా అక్కడే ఉండటంతో ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. పల్లె ఉమ తనకు జీవితంలో ఇచ్చిన సహకారం మరవలేనని.. అందుకే ఆమెను స్మరించుకుంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు రఘునాథరెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పల్లె ఉమ ఫౌండేషన్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని.. ఇవి మరింత విస్తృతం చేస్తామని అంటున్నారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments