Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ అలెర్ట్...ఆ పని చేసారో కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే...

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:10 IST)
సోషల్‌ మీడియా ప్రపంచంలో వాట్సప్ ఒక సంచలనమే. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక కొన్ని సాధారణ సెల్ ఫోన్‌లలో కూడా వాట్సప్ సౌలభ్యం ఉంది. వాట్సప్‌తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకంత నష్టాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. వాట్సప్‌లో ఎవరైనా వేధిస్తే ఇకపై ఫిర్యాదు చేయగల సౌలభ్యాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్ (డాట్‌) ఏర్పాటు చేసింది. 
 
అంతేకాకుండా అశ్లీలమైన, అభ్యంతరకరమైన సందేశాలకు కూడా అడ్డుకట్ట వేసేలా ఆర్డర్ జారీ చేసింది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కస్టమర్ డిక్లరేషన్‌ ఫారమ్‌లో అంగీకరించిన నిబంధనలను ఉల్లంఘించినట్లే. కనుక ఆ కస్టమర్‌లపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని టెలికామ్ సంస్థలు అన్నింటికీ  ఫిబ్రవరి 19న కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. 
 
బాధితులు can-dot@nic.inకు ఇమెయిల్ పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డాట్‌ కంట్రోలర్‌ ఆశిష్‌ జోషి ట్వీట్‌ చేశారు. అయితే రుజువుగా స్క్రీన్‌షాట్‌లను కూడా ఇవ్వాలి.  ఫిర్యాదులు సంబంధిత టెలికామ్ ప్రొవైడర్‌తో పాటుగా పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లబడతాయి. అభ్యంతరకరమైన, అశ్లీలమైన, అనధికారిక కంటెంట్‌ అలాగే ఉంటే ప్రొవైడర్ల లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇకనైనా తగ్గుతాయేమో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments