సోషల్ మీడియా ప్రసార సాధనాల్లో ఒకటైన ఫేస్‌బుక్ ఇపుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ యూజర్లందరూ వినియోగించుకోవచ్చు. నిజానికి గత కొన్ని రోజుల క్రితం ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అపుడు కొంతమందికి మాత్రమే పరిమితం చేయగా, ఇపుడు ఈ నిబంధనను తొలగించింది.
పలితంగా ప్రతి యూజర్ దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ మెసెంజర్‌లో యూజర్లు ఎవరైనా తాము అవతలి వారికి పంపిన మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేయవచ్చు. అయితే అందుకుగాను 10 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ లోపలే మెసేజ్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ లభిస్తున్నది.