Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆండ్రాయిడ్ ఫోనులో వాట్సాప్ కాల్ రికార్డింగ్.. ఎలా?

ఆండ్రాయిడ్ ఫోనులో వాట్సాప్ కాల్ రికార్డింగ్.. ఎలా?
, మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (19:05 IST)
ఇపుడు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ టెక్నాలజీతో పని చేసే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అయితే, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ఒకటి. ఇందులో కూడా సులభతరమైన అనేక ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా వాట్సాప్‌లో వచ్చే ఫోన్ కాల్‌ను రికార్డు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అయితే, ఇది థర్డ్ పార్టీ యాప్ ద్వారానే సాధ్యపడుతుంది. అది ఎలా అన్నది తెలుసుకుందాం. 
 
ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో పని చేసే ప్రతి స్మార్ట్ ఫోనులో వాట్సాప్ కాల్‌ను రికార్డు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రయోజనకరం. ప్రధానంగా మీడియాలో పని చేసే ప్రతి ఒక్కరికీ ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నిజానికి ఫోనులో మాట్లాడే వ్యక్తి అనుమతి లేకుండా అతనితో కొనసాగించే సంభాషణలను రికార్డు చేయలేం. కానీ, థర్డ్ పార్టీ యాప్ వల్ల ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండానే వాట్సాప్ కాల్‌ను రికార్డు చేయవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందంతా ఒక్కటే.
 
స్మార్ట్ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్‌కెళ్లి.. క్యూబ్ కాల్ రికార్డర్‌ ఏసీఆర్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆ యాప్ అడిగిన వివిధ రకాల పర్మిషన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్‌కు వెళ్లి క్యూబ్ కాల్ రికార్డ్ ఏసీఆర్‌కు ఆన్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎవరితో మాట్లాడినా ఆ కాల్ రికార్డు అవుతుంది. అందుకు నిదర్శనంగా క్యూబ్ కాల్ రికార్డ్‌‌ గుర్తు (స్పీకర్ మార్కు)పై ఒక లైట్‌ గుర్తును చూపిస్తుంది. దాని పక్కనే వాయిస్ రికార్డు అవుతున్నట్టుగా మరో సింబల్ కనిపిస్తుంటుంది. 
 
ఒకవేళ క్యూబ్ కాల్ రికార్డర్‌లో ఎర్రర్ అని చూపిస్తే మాత్రం ఫోనులో సెట్టింగ్‌ ఆప్షన్‌కు వెళ్లాలి. ఈ సెట్టింగ్‌లో మార్పులు చేసిన తర్వాత వాట్సాప్ కాల్‌ చేసి చెక్ చేసుకోవాలి. క్యూబ్ కాల్ విడ్జెట్‌ లైట్ గుర్తును చూపిస్తే అది కాల్ రికార్డు చేస్తున్నట్టుగా భావించాలి. అప్పటికీ అది ఎర్రర్ అని చూపిస్తే మీ స్మార్ట్ ఫోన్ క్యూబ్ కాల్ రికార్డింగ్‌కు సపోర్టు చేయడం లేదని భావించాలి. 
 
ఇకపోతే, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాయిస్ రికార్డింగ్‌ను కూడా చేసుకోవచ్చు. 'స్మార్ట్ వాయిస్ రికార్డర్' అనే వాయిస్ రికార్డింగ్ యాప్‌తో కూడా యూజర్లు తమ ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ 2.3 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఇన్‌స్టాల్ అవుతుంది. దీన్ని ప్లే స్టోర్ నుంచి యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
స్మార్ట్ వాయిస్ రికార్డర్ యాప్ ద్వారా కాల్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఏదైనా ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు లేదా ఔట్ గోయింగ్ కాల్ చేసినప్పుడు డివైస్‌లో లౌడ్ స్పీకర్ ఆన్ చేయాలి. అనంతరం కాల్‌ను క్లోజ్ చేయకుండా హోమ్ స్క్రీన్‌పైకి వచ్చి స్మార్ట్ వాయిస్ రికార్డర్ యాప్‌‌ను ఓపెన్ చేయాలి. దాంట్లో ఉండే పెద్దదైన గుండ్రని రెడ్ కలర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీంతో కాల్ రికార్డింగ్ యాక్టివేట్ అవుతుంది. అయితే ఇలా కాల్స్‌ను రికార్డ్ చేసే సమయంలో అవతలి వ్యక్తుల వాయిస్ క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ సందర్భంలో అవసరమైతే డివైస్ వాల్యూమ్‌ను పెంచుకోవచ్చు. 
 
కాల్ పూర్తవగానే యాప్‌లోని ఫినిష్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీంతో రికార్డింగ్ పూర్తవుతుంది. అనంతరం ఈ రికార్డింగ్‌ను మీకనుకూలమైన పేరుతో సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసిన ఫైల్‌ను వాయిస్ రికార్డర్ యాప్‌లోని రికార్డింగ్స్ సెక్షన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే, ఫోన్ కాల్ లేదా వాట్సాప్ కాల్‌ను మీరు సంభాషించే వ్యక్తికి తెలుపకుండా రికార్డు చేయడం అనేది వ్యక్తిగత ప్రైవసీ ఉల్లంఘన కిందకే వస్తుందన్న విషయాన్ని మరువరాదు సుమా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4వేల మంది అమ్మాయిలతో పడక పంచుకున్నాను.. ఎలా బతికానో తెలుసా?