Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యూరి... కలెక్షన్ల వరద...

Advertiesment
Bollywood Movie
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:28 IST)
బాలీవుడ్‌లో జనవరి 11న విడుదలైన యూరీ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొడుతోంది. చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కొద్దిపాటి లాభాలు వస్తే చాలనుకున్న నిర్మాతలకు ఇప్పుడు ఇలాంటి సినిమాలు మరో ఐదు తీసేందుకు కావాల్సిన డబ్బు వచ్చింది.
 
ఈ సినిమా విషయంలో ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించిన హీరో విక్కీ కౌశల్ ఇప్పటివరకు క్యారెక్టర్ రోల్స్ చేసాడు, ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేని యామి గౌతమ్ ఇందులో హీరోయిన్ పాత్ర పోషించింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఇదే మొదటి సినిమా. ఈ సినిమాకు పని చేసిన బృందం అంతా ఇప్పటివరకు పబ్లిసిటీ లేనివాళ్లే కావడంతో ఈ చిత్రం విడుదలయ్యేనాటికి దీనిపై అస్సలు అంచనాలే లేవు.
 
సినిమాకు పబ్లిసిటీ కూడా సరిగా లేకుండా విడుదల కావడంతో మొదట్లో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే విడుదలైన తర్వాత సినిమాను చూసినవారి ద్వారా మౌత్ పబ్లిసిటీ రావడంతో సినిమాకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతూ వచ్చింది. తక్కువ స్క్రీన్‌లలో విడుదలైన ఈ సినిమాకు రెండవ వారం నుండి థియేటర్లు బాగా పెరిగాయి. ఊహించని కలెక్షన్లతో సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. మొదటి వారంలో టిక్కెట్లు మిగిలిపోయిన ఈ సినిమాకు రెండవ వారాంతానికి టిక్కెట్లు దొరకడం కష్టమైపోయింది.
 
45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 250 కోట్లకు చేరువలో ఉంది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే 300 కోట్ల క్లబ్‌ను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చిత్రానికి ఆదరణ బాగా వస్తోంది. బాలీవుడ్‌లో ప్రముఖులతో సహా రాజకీయ ప్రముఖుల కూడా ఈ చిత్రాన్ని గురించి గొప్పగా చెప్తూ ఉండటం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కియారా గురించి రానా, రామ్ చరణ్‌లు ఏం చెప్పుకున్నారో తెలుసా...? వైరల్ అవుతున్న వీడియో