Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.4,999కే 32 అంగుళాల స్మార్ట్‌టీవీ కావాలా?

Advertiesment
Android LED TV
, గురువారం, 31 జనవరి 2019 (14:15 IST)
భారతదేశ టీవీ మార్కెట్‌లో అతి తక్కువ ధరతో స్మార్ట్‌టీవీ అందుబాటులోకి రానుంది. సామీ ఇన్‌ఫర్మేటిక్స్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ప్రస్తుతం టెలివిజన్ మార్కెట్‌లో స్మార్ట్‌టీవీల హవా నడుస్తోంది. కాబట్టే దిగ్గజ కంపెనీలన్నీ మన మార్కెట్‌పై కన్నేసాయి. అత్యద్భుతమైన ఫీచర్లను కలిగిన స్మార్ట్‌టీవీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 
 
ప్రస్తుతం 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 10,000 నుండి ప్రారంభమవుతోంది, అయితే సామీ ఇన్‌ఫర్మేటిక్స్ అనే కంపెనీ అతితక్కువ ధరకే స్మార్ట్‌ టీవీలను కేవలం రూ.4,999లకే 32 అంగుళాల ఆండ్రాయిడ్‌ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని మార్కెట్‌లోకి విడుదల చేసింది. బుధవారం నాడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని ఆవిష్కరించింది. 
 
టీవీలను సామీ మొబైల్ యాప్ సాయంతో కొనుగోలు చేయవచ్చు. టీవీ అసలు ధర రూ.4,999. దీనికి పన్నులు, డెలివరీ చార్జీలు జోడించుకుంటే మరో 1,000 నుండి 2,000 వరకు అదనంగా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
 
టీవీ ప్రత్యేకతలు 
1366×786 రిజల్యూషన్ స్క్రీన్
ఐపీఎస్ హెచ్‌డీ ప్యానెల్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఓఎస్
రెండు 10 వాట్స్ స్పీకర్స్
2 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌లు
 
2 యూఎస్‌బీ పోర్టులు
అన్ని రకాల స్మార్ట్ యాప్స్ పనిచేసేలా తయారుచేయబడింది
స్మార్ట్ టీవీ రిమోట్‌ను కలిగి ఉంటుంది
 
వాల్ మౌంట్ ఉపకరణాలు కూడా వస్తాయి
టీవీ బరువు 6 కేజీలు వరకు ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకులో స్పైడర్ మ్యాన్... బిత్తరపోయిన సహోద్యోగులు... (Watch Video)