Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

4వేల మంది అమ్మాయిలతో పడక పంచుకున్నాను.. ఎలా బతికానో తెలుసా?

Advertiesment
4వేల మంది అమ్మాయిలతో పడక పంచుకున్నాను.. ఎలా బతికానో తెలుసా?
, మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (17:13 IST)
కోటీశ్వరుడైన ఓ వ్యక్తి ప్రస్తుతం ఆస్తులను కోల్పోయి కూలిపని చేసుకుంటున్నాడు. స్కాట్లాండ్‌‌కు చెందిన మైకేల్ కరోల్.. సాధారణ మధ్య తరగతిలో కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఈ నేపథ్యంలో గత 2002లో ఇతనికి అదృష్టం తలుపు తట్టింది. అతడు కొనుగోలు చేసిన లాటరీలో 10 మిలియన్ పౌండ్లు తగిలాయి. భారత కరెన్సీ ప్రకారం ఈ మెుత్తం దాదాపు రూ.92కోట్లు అని అంచనా. 
 
దీంతో డబ్బులు చేతికొచ్చే సరికి.. విలాసాలకు అలవాటు పడ్డాడు కరోల్. ఎప్పుడు చూసినా మందుతో పాటు అమ్మాయిలతో గడిపేవాడు. ఈ క్రమంలో కరోల్‌ పద్ధతి నచ్చక అతడి భార్య పుట్టంటికి వెళ్లిపోయింది. ఇలా విలాసాలకు, మద్యానికి, అమ్మాయిలకు అలవాటు పడిన కరోల్.. తన చేతులో వున్న డబ్బునంతా కరగదీశాడు. 
 
డబ్బు కరిగిపోయాక అతని నుంచి స్నేహితులు దూరమయ్యారు. అలా ఖజానా ఖాళీ కావడంతో రోడ్డుపై పడిన కరోల్ కూలీగా మారాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరోల్.. ఒకప్పుడు తానెలా విలాసవంతంగా వున్నానో చెప్పాడు. మత్తుమందులకు అలవాటు పడి వాటి కోసం భారీ ఖర్చు చేసేవాడినని చెప్పాడు. 
 
స్నేహితులకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశాను. దాదాపు 4వేల మంది మహిళలతో పడక పంచుకున్నాను. అయితే ప్రస్తుతం తన వద్ద డబ్బు లేకపోవడంతో.. తనకు అందరూ దూరమయ్యారని వాపోయాడు. డబ్బు వుంది కదాని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని మైకేల్ చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ గ్రామంలో 4 గంటలకు సూర్యాస్తమయం... 7 గంటలకు సూర్యోదయం...