Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి రికార్డులను కొల్లగొడుతున్న చిత్రం...

Advertiesment
URI
ఏమాత్రం అంచనాలు లేకుండా, ఎటువంటి పేరున్న నటులు లేకుండా వచ్చి అద్భుతాలు సృష్టిస్తోన్న సినిమా 'యూరీ - ది సర్జికల్ స్ట్రయిక్' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసుకుంటూ దూసుకుపోతోంది. బాలీవుడ్‌లోనే కాకుండా భారతదేశం అంతటా ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
 
2016వ సంవత్సరంలో యూరీలో మిలిటరీ బేస్ క్యాంప్‌పై జరిగిన దాడి సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పాకిస్థాన్‌పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి చూపిన విధానం చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకుంటున్నారు.
 
తాజాగా ఈ సినిమా బాహుబలి రికార్డును అధిగమించింది. బాహుబలి విడుదలైన 23వ రోజు శనివారం 6.35 కోట్లు వసూలు చేయగా యూరీ 6.53 కోట్లు వసూలు చేసింది, ఆలాగే బాహుబలి 24వ రోజు ఆదివారం 7.80 కోట్లు వసూలు చేయగా యూరీ 8.71 కోట్లు రాబట్టి రికార్డు సాధించింది. ఈ వసూళ్లు ఇలాగే కొనసాగితే ఈ సినిమా ఇంకెన్నో రికార్డులను కూడా బద్దలుకొడుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ సురవరంగా 'ముద్ర'ను వేయబోతున్న హీరో నిఖిల్