Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

5జీ డేటాతో.. హ్యాకర్లు పండగ చేసుకుంటారట.. ఎలాగంటే?

5జీ డేటాతో.. హ్యాకర్లు పండగ చేసుకుంటారట.. ఎలాగంటే?
, సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (12:06 IST)
ప్రపంచ వ్యాప్తంగా 4జీ డేటా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2జీ, 3జీ కనుమరుగై.. ప్రస్తుతం 4జీ డేటా వాడుకలో వచ్చేసింది. ఇందుకు తోడు స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో 4జీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ డేటా చాలనట్లు ప్రస్తుతం 5జీ డేటా అందుబాటులోకి రానుంది. 2020లో 5జీ డేటా భారత్‌లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని టాక్ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో 5జీ డేటాతో పెను ముప్పు పొంచి వుందని పరిశోధకులు కనుగొన్నారు. 5జీ డేటాతో భద్రతకు ముప్పు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 5జీ డేటాతో హ్యాకర్లు సులభంగా డేటాను చోరీ చేసుకోగలరని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. 
 
5జీ ఎయిర్‌వేవ్స్ ద్వారా కాల్స్, డెక్ట్స్ సందేశాల డేటాను సులభంగా కాజేస్తారని, 5జీ ఎయిర్‌వేవ్స్ ద్వారా డేటా స్పైయింగ్ అవుతుందని.. బెర్లిన్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌తో ప్రైవసీకి విఘాతం కలుగుతుందని.. స్మార్ట్ ఫోన్ల నుంచి డేటాను సులభంగా దోచుకునేందుకు ఈ నెట్‌వర్క్ సులభంగా వుంటుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
డేటా చోదకులు, హ్యాకర్లకు 5జీ ఎయిర్‌వేవ్స్ ఎంతగానో సహకరిస్తాయని పరిశోధకులు తెలిపారు. 5G భద్రతతో వైరుధ్యం వుందని, ఇది ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటికి లేదా ఐఎమ్ఎస్ఐ క్యాచర్లకు వ్యతిరేకంగా వుంటుందని.. 5జీ డేటా ఫోన్లలో గూఢచర్యం చేసేందుకు సెల్ టవర్ల వలె వ్యవహరిస్తుందని.. పరిశోధకులు తేల్చారు.
 
డేటా ప్రోటోకాల్ ప్రకారం.. ముందుగానే 5జీ డేటా భద్రతకు సంబంధించిన అంశాలను గుర్తించి.. పరిశోధకులు లొసుగులను పరిష్కరించే అవకాశం వుంది. అలా జరిగితే 2019 చివరి నాటికి 5జీ డేటాను విడుదల చేసేందుకు టెలికాం రంగం సిద్ధంగా వున్నట్లు సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువావీ 2020 నాటికి 5జీ నెట్‌వర్క్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ 1000 రెట్లు వేగంగా పనిచేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాన్సర్ పేషెంట్ల పడకపై నిద్రించిన వైద్యురాలు.. మద్యం తాగి?