ఫేస్ ఐడీ టెక్నాలజీతో ఐఫోన్‌-13 సిరీస్‌.. టచ్ ఐడీ కూడా..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (17:14 IST)
Iphone 13
ఐఫోన్‌-13 సిరీస్‌ మెరుగైన ఫేస్‌ ఐడీ టెక్నాలజీతో సహా పలు అదనపు ఆకర్షణలతో ముందుకొస్తోంది. ఈ సిరీస్‌లో ఐఫోన్‌ 13 ప్రో మోడల్స్‌లో సీఎంఓఎస్‌ ఇమేజ్‌ సెన్సర్‌ అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. ఐఫోన్‌-13 సిరీస్‌లో ఫింగర్‌ప్రింట్‌తో గుర్తించే టచ్‌ ఐడీని యాపిల్‌ వాడనుందని ఇప్పటికే అప్‌డేట్స్‌ వచ్చాయి. 
 
ఒకే కెమెరా మాడ్యూల్‌తో ఆర్‌ఎక్స్‌, టీఎక్స్‌, ఫ్లడ్‌ ఇల్యూమినేటర్‌ సెన్సర్లను కలుపుతూ మెరుగైన ఫేస్‌ ఐడీ సిస్టమ్‌ ఐఫోన్‌ 13 సిరీస్‌లో అదనపు ఆకర్షణగా నిలుస్తుందని డిజిటైమ్స్‌ వెల్లడించింది. దీంతో ప్రస్తుత ఐఫోన్‌ మోడల్స్‌లో కనిపించే గీతలను మరింత తగ్గించవచ్చని పేర్కొంది.
 
మరోవైపు ఐఫోన్‌ 13 సిరీస్‌లో అప్‌గ్రేడ్‌ చేసిన అల్ర్టావైడ్‌యాంగిల్‌ లెన్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఐఫోన్‌ మోడల్స్‌ కెమెరాల్లో మెరుగైన ఇమేజ్‌లను రాబట్టేందుకు సెన్సర్‌-షిఫ్ట్‌ స్టెబిలైజేషన్‌ టెక్నాలజీని వాడనున్నట్టు టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 
 
అయితే 13 సిరీస్‌ఐఫోన్‌ 13 సిరీస్‌ను ఎప్పటి నుంచి లాంఛ్‌ చేస్తారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. యాపిల్‌ కొత్త మోడల్స్‌ విడుదలయ్యే సెప్టెంబర్‌లోనే ఐఫోన్‌ 13 సిరీస్‌ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments