Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతదేహం ఒక్కసారిగా లేచి నిలబడింది.. అంతే భయంతో పరుగులు!

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (15:18 IST)
అంత్యక్రియలు చేస్తుండగా మృతదేహాలు లేచి కూర్చోవడం.. తిరిగి శ్వాస రావడం వంటి వార్తలు వినేవుంటాం.  తాజాగా అలాంటి ఘటన పాకిస్థాన్‌లో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరాచీలో అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో.. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె డెత్ సర్టిఫికేట్‌ను కూడా ఇచ్చేశారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
అయితే అంత్యక్రియల్లోనే షాకిచ్చే సంఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియల్లో భాగంగా రషీదా బీబీ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా.. ఒక్కసారిగా ఆమె లేచి నిలబడింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. 
 
వెంటనే ఆమెను పరీక్షించేందుకు డాక్టర్లను రప్పించారు రషీదా బీబీ కుటుంబ సభ్యులు. వారు పల్స్ చెక్ చేయడంతో ఆమె శ్వాస తీసుకుంటుందని ఆరోగ్యానికి ఢోకాలేదని తెలిపారు. ఆపై చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments