Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్ మెషిన్‌లో చిక్కుకున్న చిన్నారి.. సేఫ్టీ టిప్స్ చెప్పిన తల్లి...

ఇంట్లోకి కొత్తగా తెచ్చిన వాషింగ్ మెషిన్‌లో మూడేళ్ళ చిన్నారి చిక్కుకుంది. ఈ విషయం తెల్లికి తెలియడంతో ఆమె తల్లడిల్లి పోయింది. ఆ తర్వాత తన భర్త సహకారంతో కుమార్తెను సురక్షితంగా రక్షించుకుంది. పిమ్మట ఇలాంట

Webdunia
బుధవారం, 18 జులై 2018 (11:54 IST)
ఇంట్లోకి కొత్తగా తెచ్చిన వాషింగ్ మెషిన్‌లో మూడేళ్ళ చిన్నారి చిక్కుకుంది. ఈ విషయం తెల్లికి తెలియడంతో ఆమె తల్లడిల్లి పోయింది. ఆ తర్వాత తన భర్త సహకారంతో కుమార్తెను సురక్షితంగా రక్షించుకుంది. పిమ్మట ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ సేఫ్టీ టిప్స్ చెపుతూ ఓ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇపుడు వైరల్ అయింది. ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లి వెల్లడించిన వివరాల మేరకు...
 
అమెరికాలోని కొలొరెడో‌కి చెందిన లిండ్సే మాక్వేర్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, ఇటీవల ఓ కొత్త ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేశారు. వాషింగ్ మెషీన్ తీసుకువచ్చిన మరుసటి రోజు నుంచి నాలుగేళ్ల పెద్ద కొడుకు ఏడుస్తూ కనిపించాడు. వాడి ముఖం చూస్తే చాలా భయపడిపోయినట్లున్నాడు. చిన్న చెల్లి వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కుందని భయపడుతూ తల్లిదండ్రులకు చెప్పాడు. 
 
దీంతో వెంటనే వారు పడక గది నుంచి ఒక్క ఉదుటున వాషింగ్ మెషిన్ వద్దకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితి చూడగానే భయపడిపోయారు. వారి మూడేళ్ల చిన్నారి క్లోయి.. వాషింగ్ మెషిన్‌లో చిక్కుకుంది. పైగా, మెషీన్ నీటితో నిండివుంది. లోపల లాక్ అయిపోయిన చిన్నారి ఆర్తనాదాలు చేస్తోంది. అయితే ఆ చిన్నారి అరుపులు బయటకు వినిపించడం లేదు. వెంటనే ఆ తల్లిదండ్రులు వాషింగ్‌మెషిన్ పవర్ ఆఫ్ చేసి ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. 
 
ఆ చిన్నారికి ఎటువంటి గాయాలుకాక పోవడం విశేషం. తర్వాత ఆ వాషింగ్ మెషిన్‌కు చైల్డ్‌లాక్ ఉందనే విషయాన్ని గుర్తించారు. దీనికారణంగా మెషిన్‌లోకి విద్యుత్ రాదని గుర్తించారు. ఆ చిన్నారి వాషింగ్ మెషిన్ ఫ్రంట్ డోర్ తీసుకుని లోనికి వెళ్లిపోయి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ పోస్టు ద్వారా ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని లిండ్సే సూచించారు. ఈ వీడియోను ఫేస్‍‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments