Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లిలో భార్య డ్యాన్స్ చేసిందనీ..

పెళ్లిలో డ్యాన్స్ చేసిందనే కారణంతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడో భర్త. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పర్గానాలోని బసంతి ప్రాంతంలో చోటుచేసుకుంది.

Advertiesment
పెళ్లిలో భార్య డ్యాన్స్ చేసిందనీ..
, శనివారం, 7 జులై 2018 (12:51 IST)
పెళ్లిలో డ్యాన్స్ చేసిందనే కారణంతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడో భర్త. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పర్గానాలోని బసంతి ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల స్వప్న (18)అనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే శనివారం తమ బంధువుల వివాహ వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అది భర్తకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని అక్కడే నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. 
 
అయితే ఇంటికి వెళ్లిన స్వప్నను.. తన తల్లితో కలిసి సుబీర్ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరిని నమ్మించే యత్నించాడు. కానీ, స్థానికులు, స్వప్న తల్లిదండ్రులు సుబీరే ఆమెను హత్యచేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లైన రోజు నుంచి సుబీర్‌ కట్నం కోసం స్వప్నను వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త సుబీర్, అతని తల్లిని అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్.. టీచర్లు... విద్యార్థుల అత్యాచారం