Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు కామాంధులు ఓ మహిళను ఏం చేస్తున్నారో చూడండి (వీడియో)

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని మరోమారు నిరూపితమైంది. ఉన్నావ్‌లో గత నెలలో తొమ్మిదేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertiesment
ముగ్గురు కామాంధులు ఓ మహిళను ఏం చేస్తున్నారో చూడండి (వీడియో)
, శుక్రవారం, 6 జులై 2018 (13:53 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని మరోమారు నిరూపితమైంది. ఉన్నావ్‌లో గత నెలలో తొమ్మిదేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యేడాది క్రితం ఉద్యోగం ఇప్పించమని బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెనగర్‌ను అడగ్గా.. ఇదే అదునుగా భావించిన ఎమ్మెల్యే.. 16 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరంతా జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
 
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ముగ్గురు కామాంధులు ఓ మహిళను తమ కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక వేధింపులకు గురిచేశారు. ఉన్నావ్‌కు చెందిన ముగ్గురు యువకులు.. తన ఇంట్లో ఉన్న మహిళను నిర్మానుష్య ప్రదేశానికి బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. తనను ఏమి చేయకండి అని బాధిత మహిళ వేడుకున్నప్పటికీ ఆ మృగాళ్లు వినిపించుకోలేదు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూనే చిత్రహింసలు పెట్టారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసులకు చేరడంతో.. కేసు నమోదు చేశారు. బాధితురాలి తరపు నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెపుతున్నారు. ఏదిఏమైనా వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు మృగాళ్ళలో ఇద్దరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే, వీడియో చిత్రీకరించిన వ్యక్తి ఆచూకీ కోసం కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబ కలహాలు... భార్యను పాశవికంగా వేటకొడవలితో నడిరోడ్డుపైనే?