Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కట్నం తీసుకురాలేదనీ కోడలిపై మామ అత్యాచారం.. జుట్టు కత్తిరించి మరీ...

వరకట్నం తీసుకోవడం లేదా డిమాండ్ చేయడం చట్టరీత్యా నేరం అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... అత్తింటివారు మాత్రం మారడం లేదు. ఫలితంగా అనేక మంది మహిళలు వరకట్నానికి బలవుతున్నారు. అంతేనా... వారు అనేక రకాలైన

Advertiesment
కట్నం తీసుకురాలేదనీ కోడలిపై మామ అత్యాచారం.. జుట్టు కత్తిరించి మరీ...
, శనివారం, 7 జులై 2018 (09:04 IST)
వరకట్నం తీసుకోవడం లేదా డిమాండ్ చేయడం చట్టరీత్యా నేరం అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... అత్తింటివారు మాత్రం మారడం లేదు. ఫలితంగా అనేక మంది మహిళలు వరకట్నానికి బలవుతున్నారు. అంతేనా... వారు అనేక రకాలైన వేధింపులకు గురవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో కోడలిపై మామ అత్యాచారం చేశాడు. అంతేకాకుండా, అత్తింటివారు ఆ కోడలి జుట్టు కత్తిరించి, ఇంట్లో బంధించి మరీ చిత్ర హింసలకు గురిచేశారు. ఈ దారుణం  గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డోలాస్ నగర్‌లో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మణి అనే యువతి ఎనిమిదేళ్ల క్రితం రాంబాబు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరిదీ ఒకటే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి అడ్డంకులు ఏర్పడలేదు. అయితే, ప్రేమ వివాహం కావడంతో కట్నం లేకుండానే పెళ్లి జరిగింది. దీంతో అప్పటి నుంచి అత్తింటి వారు మణిపై కక్షగట్టారు. కట్నం తీసుకురాలేదంటూ వేధించసాగారు. అయితే తనను ఎంతగా హింసిస్తున్నప్పటికీ భరిస్తూనే వచ్చింది కానీ, ఆమె మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపేందుకు అత్తింటి వారు పథకం రచించారు.
 
ఇంట్లోని డబ్బులు పోయాయని, అవి ఆమే తీసిందని ఆరోపిస్తూ భర్తతో కొట్టించారు. అంతేకాక, ఆమెను ఓ గదిలో బంధించి మూడు రోజులపాటు భర్త, అతని అక్కలు కలిసి చిత్ర హింసలకు గురిచేశారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కిందపడేసి జుట్టు కత్తిరించారు. మామ కూడా లైంగికంగా వేధించాడు. 
 
ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు నిలదీస్తే, సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించారు. దీంతో వారు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మణి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆమెను వదిలిపెట్టారు. అనంతరం మణి పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి అత్తింటి వారిపై ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔను.. నేను చెపితేనే అలా చేసుకున్నారు.. తాంత్రిక మహిళ