Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోరిక తీర్చలేదనీ ఇంటికే నిప్పుపెట్టాడు...

గుంటూరు జిల్లాలో ఓ మృగాడు దారుణానికి ఒడిగట్టాడు. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఆ కామాంధుడు ఆ మహిళ కుటుంబాన్ని సజీవదహనం చేసేందుకు ప్రయత్నించాడు. అతని దుశ్చర్యను స్థానికులు గమనించి మంటలను అదుపు చేయడంతో ఆ

కోరిక తీర్చలేదనీ ఇంటికే నిప్పుపెట్టాడు...
, మంగళవారం, 3 జులై 2018 (14:25 IST)
గుంటూరు జిల్లాలో ఓ మృగాడు దారుణానికి ఒడిగట్టాడు. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఆ కామాంధుడు ఆ మహిళ కుటుంబాన్ని సజీవదహనం చేసేందుకు ప్రయత్నించాడు. అతని దుశ్చర్యను స్థానికులు గమనించి మంటలను అదుపు చేయడంతో ఆ ఇంటిలోని వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల వైఎస్సార్‌ కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన కలకలం రేపింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పేరేచర్లలో 30 ఏళ్ల వయసు ఉన్న మహిళ భర్త దూరం కావడంతో తన ఇద్దరు పిల్లలను, ఆమె తల్లితో కలసి వైఎస్సార్‌ కాలనీలో పూరిగుడిసె వేసుకొని నివసిస్తోంది. స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. 
 
ఆమె నివశించే ఇంటికి సమీపంలోనే ఉండే మేడా రమేష్ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రమేష్‌ ఆ మహిళ ఇంటికి వెళ్లి తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో గొంతు పట్టుకొని చంపుతానని బెదిరించాడు. ఆ మహిళ లొంగకపోవడంతో ఇంటికెళ్లిపోయాడు.
 
ఈ ఘటనతో భీతిల్లిన ఆ మహిళ జరిగిన విషయాన్ని రమేష్‌ తల్లిదండ్రులకు చెప్పింది. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత మా అమ్మానాన్నతో చెబుతావా అంటూ రమేష్‌ ఆ మహిళపై దౌర్జన్యానికి దిగాడు. స్థానికుల సహకారంతో ఆమె మేడికొండూరు పోలీసులకు సమాచారం అందించింది. అక్కడకు చేరుకున్న పోలీసులు రమేష్‌ను హెచ్చరించి పంపారు.
 
గొడవ సద్దు మణిగిందని భావించి స్థానికులంతా వెళ్లిపోగా సోమవారం తెల్లవారు జామున మహిళ ఇంటికి నిప్పు పెట్డాడు. మంటలు లేవడాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకొని ఇంటిలో ఉన్నవారిని బయటకు తీసుకు వచ్చి మంటలను ఆర్పివేశారు. గృహం పూర్తిగా కాలిపోగా కట్టుబట్టలతో మహిళతో పాటు ఇద్దరు పిల్లలు, ఆమె తల్లి బయటపడ్డారు. 
 
స్థానికులు అప్రమత్తం కావడంతో వారంతా ప్రాణాలలో బయటపడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా అర్బన్‌ ఎస్పీ విజయరామారావు నిందితుడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో మేడికొండూరు పోలీసులు అప్రమత్తమై నిందితుడు రమేష్‌ను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి