Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్.. టీచర్లు... విద్యార్థుల అత్యాచారం

ఆటవిక పాలనకు నిదర్శనంగా చెప్పుకునే బీహార్‌లో మరో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినిపై సహచర విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థులను భయపెట్టాల్సిన ప్రిన్సిపాల్ కూడా మరో ఇద్

Advertiesment
తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్.. టీచర్లు... విద్యార్థుల అత్యాచారం
, శనివారం, 7 జులై 2018 (11:51 IST)
ఆటవిక పాలనకు నిదర్శనంగా చెప్పుకునే బీహార్‌లో మరో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినిపై సహచర విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థులను భయపెట్టాల్సిన ప్రిన్సిపాల్ కూడా మరో ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్యసమాజం తలదించుకునేలా ఈ ఘటన ఉంది.
 
బీహార్ రాష్ట్రంలోని సురాన్ జిల్లాలోని చాప్రాలో ఈ ఘటన జరగడం అందరినీ విస్మయ పరుస్తోంది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు ప్రైవేటు స్కూలు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. గతేడాది డిసెంబరులో తనపై తొలిసారి అత్యాచారం జరిగిందని, ఆ ఘటనను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
స్కూలు ఆవరణలోనే 18 మంది విద్యార్థులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు తెలిపింది. స్కూలు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే ఆయన మరో ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసి తనపై ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. శుక్రవారం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు సర్దార్ ఆసుపత్రిలో చేర్చారు. త్వరలోనే నివేదిక రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునందా పుష్కర్ మృతి కేసు : శశిథరూర్‌కు బెయిల్