పిడుగుల శబ్ధానికి వరుడు పరుగులు.. పెళ్ళి వద్దన్న వధువు..
భారీ వర్షం పడుతోంది. తోడు పిడుగులు పడుతున్నాయి. అంతే పెళ్లి మండపంలోని వరుడు జడుసుకున్నాడు. పిడుగుల శబ్ధానికి పరుగులు తీశాడు. అంతే కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా తనకీ వివాహం వద్దని చెప్పేసింది వధువు. పి
భారీ వర్షం పడుతోంది. తోడు పిడుగులు పడుతున్నాయి. అంతే పెళ్లి మండపంలోని వరుడు జడుసుకున్నాడు. పిడుగుల శబ్ధానికి పరుగులు తీశాడు. అంతే కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా తనకీ వివాహం వద్దని చెప్పేసింది వధువు. పిడుగుపడినందుకే పరుగులు తీసే ఈ వరుడు తనకొద్దని తెగేసి చెప్పేసింది.
పిడుగు పడ్డప్పుడే కాదు.. పిడుగు శబ్ధానికి తర్వాత కూడా వరుడు విచిత్రంగా ప్రవర్తించాడని.. అతడు మానసికంగా పరిణితి చెందలేదని భావిస్తున్నట్లు వధువు తెలిపింది. ఈ ఘటన బీహార్‌లోని సర్నా జిల్లాలో చోటుచేసుకుంది.
అయితే వధువు వరుడిని కాదన్నందుకు.. పెళ్లి వద్దని తెగేసి చెప్పినందుకు వరుడి కుటుంబీకులు, బంధువులు వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య మరింత గొడవ చెలరేగడంతో వధువు తరఫు బంధువులు రెచ్చిపోయి దాడికి దిగారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వధువు తరఫు ముగ్గురు బంధువులను అరెస్ట్ చేశారు. పెళ్లి మాత్రం ఆగిపోయింది. పిడుగు శబ్ధానికి భయపడే వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని వధువు పోలీసులతో వెల్లడించింది. ధైర్యం లేని వ్యక్తితో కాపురం చేయలేమని ఆమె తెగేసి చెప్పేసింది.