కొత్త జంట జేసీబీలో మండపానికి వచ్చింది.. ఎందుకో తెలుసా?
పెళ్ళంటే కొత్త బట్టలు, ఖరీదైన బంగారం మాత్రమే కాదు. వాహనాల విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటారు. అందుకే పెళ్లి కొడుకు కోసం ఖరీదైన కార్లను కావాలని డిమాండ్ చేస్తారు. ఇక పెళ్లి కూతురిని పల్లకిలో మోసుకురావాలనుక
పెళ్ళంటే కొత్త బట్టలు, ఖరీదైన బంగారం మాత్రమే కాదు. వాహనాల విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటారు. అందుకే పెళ్లి కొడుకు కోసం ఖరీదైన కార్లను కావాలని డిమాండ్ చేస్తారు. ఇక పెళ్లి కూతురిని పల్లకిలో మోసుకురావాలనుకుంటారు. సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొత్త జంట ప్రయాణించే వాహనాలు మెరిసిపోవాలనుకుంటారు. అయితే కేరళలోని కొత్త జంట కారును ఎంచుకోకుండా.. జేసీబీని ఎంచుకుంది.
వరుడు జేసీబీ డ్రైవర్ కావడంతో అతని బండిలోనే మండపానికి వచ్చి వివాహం చేసుకున్నారు. వధూవరులు కొత్త బట్టలతో మెరిసిపోతే.. జేసీబీ బండికూడా బలూన్లు, పువ్వులతో ఓ వెలుగు వెలిగింది. పెళ్లికూతురితో సహా జేసీబీ ఎక్కేసిన వరుడు.. మండపం వరకు అందులోనే వచ్చారు. రెండు కిలోమీటర్ల దూరం జేసీబీలోనే ప్రయాణం చేశారు. ఆపై మండపంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.