Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెంతుల్ని మజ్జిగ లేదా నీటిలో కలిపి తీసుకుంటే? (video)

గర్భంతో వున్న మహిళలు రోజూ మెంతులను నిత్యం ఏదో రూపంలో ఆహారంలో చేర్చుకుంటే.. ప్రసవం సమయంలో కలిగే నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. కానీ మెంతుల్ని రోజుకో స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. మోతాదు మించకుండా

మెంతుల్ని మజ్జిగ లేదా నీటిలో కలిపి తీసుకుంటే? (video)
, మంగళవారం, 10 జులై 2018 (10:37 IST)
గర్భంతో వున్న మహిళలు రోజూ మెంతులను నిత్యం ఏదో రూపంలో ఆహారంలో చేర్చుకుంటే.. ప్రసవం సమయంలో కలిగే నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. కానీ మెంతుల్ని రోజుకో స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. మోతాదు మించకుండా తీసుకోవాల్సి వుంటుంది. 
 
మహిళలకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్ని వాడటం ద్వారా స్త్రీలకు రుతుక్రమం సరిగ్గా వుంటుంది. హార్మోన్ల విడుదల సక్రమం అవుతుంది. రుతుక్రమ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతులను నెయ్యిలో దోరగా వేయించి మెత్తగా చూర్ణం చేయాలి. దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి.. ఆ మిశ్రమంలో పంచదార చేర్చి హల్వాలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.
 
అలాగే రోజూ పది నుంచి 20 గ్రాముల మెంతుల్ని మజ్జిగ లేదా నీటిలో కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తద్వారా గుండె జబ్బులు నయం అవుతాయి. అధిక బరువు తగ్గుతారు. ఇంకా భోజనం చేసేటప్పుడు ఒక టీస్పూన్ మెంతులను తింటే భోజనం తరువాత గ్యాస్, అసిడిటీ రాకుండా ఉంటాయి. మధుమేహాన్ని మెంతులు దూరం చేస్తాయి. 
 
రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో గుప్పెడు మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపునే తాగి అనంతరం మెంతులను తినేయాలి. ఇలా రోజూ చేస్తే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. తేనె, నిమ్మరసం, మెంతుల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. గొంతు నొప్పి, మంట తగ్గుతాయి.
 
పెద్ద పేగులో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. దీని వల్ల పెద్ద పేగు శుభ్రమవుతుంది. కొలన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మెంతులు చర్మాన్ని కూడా సంరక్షిస్తాయి. 
 
మెంతులను పొడి చేసి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై మచ్చలు ఉన్న ప్రాంతంలో రాస్తే మచ్చలు తొలగిపోతాయి. కేశాలకు, మాడుకు మెంతుల పొడి పేస్టును రాసుకుంటే చుండ్రు, తొలగి వత్తుగా జుట్టు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెడిక్యూర్ ఎలా చేస్తారు?