Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మందార పూవులను కొబ్బరినూనెలో దోరగా వేయించి....

మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పూవు మందార పూవు. మనం నల్లటి వత్తైన జట్టును పొందాలంటే ఈ మందార పూవు ఎంతగానో సహాయపడుతుంది. దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. 1. మందార పూవులను కొబ్బరినూనెలో దోరగా వేయించి ఆ పిప్పిని వడకట్టి ఆ నూనెను తలకు బాగా మర్ధనా చేయా

మందార పూవులను కొబ్బరినూనెలో దోరగా వేయించి....
, సోమవారం, 9 జులై 2018 (22:55 IST)
మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పూవు మందార పూవు. మనం నల్లటి వత్తైన జట్టును పొందాలంటే ఈ  మందార పూవు ఎంతగానో సహాయపడుతుంది. దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. మందార పూవులను కొబ్బరినూనెలో దోరగా వేయించి ఆ పిప్పిని వడకట్టి ఆ నూనెను తలకు బాగా మర్ధనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
2. మందార పూవులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దానికి రెండు చెంచాల మెంతి పిండిని కలపాలి. దానికి కొబ్బరి, ఆలివ్ ఆయిల్‌ను సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేసి చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని తలస్నానం చేసే ముందు తలకు బాగా మర్ధనా చేసి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే మంచి ఒత్తైన జుట్టును పొందవచ్చు.  
 
3. మందారపూలను పాలతో కలిపి మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును జుట్టు ఎక్కువుగా రాలుతున్న ప్రదేశంలో రాసుకుంటే రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది. 
 
4. మందారపూల పొడికి అరకప్పు పెరుగు, కొంచెం నిమ్మరసం కలిపి తలకు పూతలా వేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే నిగనిగలాడే వత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇలా క్రమంతప్పకుండా చేయడం వలన చుండ్రు, దురద సమస్య కూడా తగ్గుతుంది.
 
5. మందారపూలు, గుంటగలగరాకూ, గోరింటాకు కలిపి మెత్తగా నూరి తలకు పూత వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నల్లగా పొడవుగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరి జ్యూస్‍‌తో ఎంతో మేలు.. ఎలా చేయాలో వీడియోలో చూడండి..