Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోక్లామ్‌లో చైనా కలకలం: 400 మీటర్ల పొడవైన గోడ నిర్మాణం

డోక్లామ్‌లో మళ్లీ చైనా కలకలం రేపింది. డోక్లామ్‌ సమీపంలో సొరంగాలు, బ్యారక్‌ల వంటి భారీ నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులు భారత బలగాలకు కనిపించకుండా 400 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మించింది. డోక్లామ్ సమీప

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (18:12 IST)
డోక్లామ్‌లో మళ్లీ చైనా కలకలం రేపింది. డోక్లామ్‌ సమీపంలో సొరంగాలు, బ్యారక్‌ల వంటి భారీ నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులు భారత బలగాలకు కనిపించకుండా 400 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మించింది. డోక్లామ్ సమీపంలోని చైనా భూభాగంలో 200 అత్యాధునిక నిఘా వ్యవస్థ గల టెంట్లను ఏర్పాటు చేసినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వివాదాస్పద డోక్లామ్‌లో సైనికులకు శాశ్వత స్థావరాల కోసం చైనా 16 బ్యారక్‌‌లు, ఆరు సొరంగాలు తవ్వించినట్లు సమాచారం. 
 
డోక్లామ్‌లో చైనా చర్యలకు ధీటుగా భారత్ యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీవోఈకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) సిబ్బంది.. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (సీవోఈ) ఆదేశాలతో పనులు ప్రారంభించింది. ఇప్పటికే ఆధునిక భారీ యంత్రాలు అక్కడి చేరుకున్నాయని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం