స్కైప్, యాపిల్, యూట్యూబ్‌పై చైనా నిషేధం ఎందుకో తెలుసా?

చైనా సర్కారు విదేశీ యాప్‌ల నిషేధంపై వివరణ ఇచ్చింది. విదేశీ ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థలతో తమకు మేలు జరగదని చైనా స్పష్టం చేసింది. తమ దేశ ప్రజలు తమ దేశానికి చెందిన కమ్యూనికేషన్ యాప్‌‌లనే వినియోగిస్తార

శుక్రవారం, 24 నవంబరు 2017 (15:36 IST)
చైనా సర్కారు విదేశీ యాప్‌ల నిషేధంపై వివరణ ఇచ్చింది. విదేశీ ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థలతో తమకు మేలు జరగదని చైనా స్పష్టం చేసింది. తమ దేశ ప్రజలు తమ దేశానికి చెందిన కమ్యూనికేషన్ యాప్‌‌లనే వినియోగిస్తారని చైనా చెప్పింది. 
 
దేశీ యాప్‌ల అవసరం తమకు లేదని డ్రాగన్ కంట్రీ తేల్చి చెప్పేసింది. దేశ చట్టాలకు లోబడి తమ నిర్ణయాలుంటాయని చైనా క్లారిటీ ఇచ్చేసింది. విదేశీ యాప్‌లు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని చైనా ఆవేదన వ్యక్తం చేసింది. 
 
దేశ భద్రతకు తమ ప్రజలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్న చైనా సర్కారు.. ప్రజల అవసరాల మేరకు తామే సొంతంగా యాప్‌లను రూపొందించుకోగలమని తెలిపింది. అందుకే తాము స్కైప్, యాపిల్, యూట్యూబ్ వంటి యాప్‌లపై నిషేధం విధించామని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం