Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో ఆశ్చర్యం... ఫోటోలో మాట్లాడిన సత్యసాయి బాబా (వీడియో)

పుట్టపర్తి సత్యసాయి బాబా ఫోటో చైనాలో మాట్లాడుతూ.. కనిపించింది. ఫాంగ్ సూన్ నగరంలోని సత్యసాయి భజన మందిరంలో భక్తులు భజన చేస్తుండగా బాబా ఫోటో నుంచి భక్తులతో మాట్లాడారు. ఫోటోలో బాబా పెదవులు విడివడి, మూసుకు

Advertiesment
చైనాలో ఆశ్చర్యం...  ఫోటోలో మాట్లాడిన సత్యసాయి బాబా (వీడియో)
, శనివారం, 18 నవంబరు 2017 (10:47 IST)
పుట్టపర్తి సత్యసాయి బాబా ఫోటో చైనాలో మాట్లాడుతూ.. కనిపించింది. ఫాంగ్ సూన్ నగరంలోని సత్యసాయి భజన మందిరంలో భక్తులు భజన చేస్తుండగా బాబా ఫోటో నుంచి భక్తులతో మాట్లాడారు. ఫోటోలో బాబా పెదవులు విడివడి, మూసుకుని మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది. అయితే ఫోటో నుంచి మాటలు వినిపించకపోయినా ఫోటోలో బాబా మాట్లాడే చందంగా పెదవులు కదలడం చూసిన భక్తులు మైమరచిపోయారు. 
 
ఈ అద్భుతాన్ని చూసిన భక్తులు మాత్రం బాబా తమ ప్రార్థనలకి మెచ్చి ఈ విధంగా తమను అనుగ్రహించారని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్ లలో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాబా పార్థివ దేహాన్ని వీడి ఆరేళ్లవుతున్నా సూక్ష్మ శరీరంలో తిరుగుతూ తనను నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారని బాబా భక్తులు నమ్ముతున్నారు. ఈ వీడియోతో అది రుజువైందని చెప్తున్నారు. 
 
ఇక పుట్టపర్తి సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. పుట్టపర్తిలో బాబా మహాసమాధి దగ్గరకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం నుంచి వారం రోజుల పాటు జరిగే సత్యసాయి బాబా జయంతి వేడుకలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
 
బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ప్రభుత్వం, ఇటు ట్రస్ట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వేడుకలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్, ఉపరాష్ట్రపతి రానుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రిపూట బెంగళూరులో మహిళలు కనపించకూడదు: కర్ణాటక హోం మంత్రి